‘లింగా’ ఆడియో వాయిదా

Unknown | 10:07 | 0 comments

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లింగా సినిమా ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 12న విడుదలకు సిద్ధమవుతున్న ఈసినిమా ఆడియో వాయిదా పడినట్లు తెలుస్తోంది. నవంబర్ 9న పాటలను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఈనెల 16కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అనుష్క, సోనాక్షి జంటగా కెఎస్ రవికుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతోన్న లింగా సినిమాలో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఇప్పటికే పోస్టర్స్ ఆకట్టుకోగా ట్రైలర్ మాత్రం విమర్శల పాలైంది. కానీ లింగా ట్రైలర్ కు నెటిజన్ల నుంచి విశేష స్పందన రావడం కోలీవుడ్ ను ఆశ్చర్యపరిచింది.

Category: ,

0 comments