నేత్రాలు స్వచ్ఛంద సంస్థకి రాసిచ్చిన సోనాక్షి

Unknown | 09:31 | 0 comments

వెండి తెర మీద ఏ మాత్రం అడ్డు చెప్పకుండా అందాలని ఆరబొస్తూ ప్రేక్షకులకి తన నిండైన అందాలతో కనువిందు చేస్తున్న బాలీవుడ్ బొద్దుగుమ్మ సొనాక్షి సిన్హా తనలోని మానవీయ కోణాన్ని బయటపెట్టింది. తన అందానికే వన్నె తెచ్చే ఆల్చిప్పల్లాంటి తన కళ్లని, మరణానంతరం హర్యానాకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థకి రాసిచ్చింది. ప్రస్తుతం, సొనాక్షి-సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించిన ‘లింగా’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్న లింగా లో సొనాక్షితో పాటు, అనుష్క మరో కథానాయికగా చేసింది.ఇప్పటికే కమలహాసన్, మాధవన్, స్నేహ, అమితాబ్‌బచ్చన్, జయాబచ్చన్, ఐశ్వర్యారాయ్, అమీర్ ఖాన్, కిరణ్‌రావ్‌లాంటి ప్రముఖులు నేత్రదానం చేశారు. ఈ జాబితాలో ప్రస్తుతం సొనాక్షి కూడా చేరింది.

Category: ,

0 comments