ఆ డైరెక్టర్ నన్ను పడుకోమన్నాడు ?

Unknown | 20:49 | 0 comments

సౌతిండియన్ పరిశ్రమలకన్నా బాలీవుడ్ ఇండస్ర్టీనే బెటర్ అంటోంది ఈ రెండు పరిశ్రమలో సినిమాలు చేస్తున్న హీరోయిన్ సుర్వీన్ చావ్లా మొన్నామధ్యే ”హేట్ స్టోరీ-2”లో తన పాత్రకు మస్త్ మసాలా జోడించి ఆడియెన్స్ మతులు పోగొట్టిన ఈ హాట్ లేడీ.. దక్షిణాది సినీపరిశ్రమపై ‘క్యాస్టింగ్ కోచ్’ ఆరోపణలు గుప్పించింది. ‘తనకు ప్రస్తుతం బాలీవుడ్‌లో ఏ ఇబ్బందీ లేదుకానీ.. దక్షిణాదిలో సినిమాలు చేసిన సమయంలో ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చింది. అప్పట్లో తనకు సినిమా ఆఫర్ చేయడానికి ముందుకొచ్చిన ఓ క్యాస్టింగ్ ఏజెంట్.. సినిమా కథ బాగా అర్థం కావడానికి ఆ సినిమా డైరెక్టర్ తనతో సెక్స్‌కి అంగీకరించాల్సిందిగా అడుగుతున్నాడని చెప్పాడు. ఆ సినిమా అంగీకరించాలంటే, నేను తనతో పడుకోవాలనేది సదరు డైరెక్టర్ విధించిన షరతు అనేది తనకు అర్థమైంది’ అంటోంది సుర్వీన్. అందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పడంతో సదరు క్యాస్టింగ్ ఏజెంట్ అక్కడినుంచి జారుకున్నాడని తెలిపింది. తమిళంలో కొన్ని సినిమాలు, తెలుగులో ఓ సినిమా చేసిన సుర్వీన్, ప్రత్యేకించి పలానా అని ఏ డైరెక్టర్ పేరు చెప్పకుండా ఈ ఆరోపణలు చేసింది.

సుర్వీన్ చేసిన ఆరోపణలతో మరోసారి సినీపరిశ్రమలో క్యాస్టింగ్ కోచ్ అనే అంశం తెరపైకొచ్చింది. గతంలో చాలామంది ఈ ఆరోపణలు చేసిన సందర్భాలున్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆధారాలు లభ్యమవుతున్నాయి. మిగతా సందర్భాల్లో అది తెరచాటుకే పరిమితమైపోతున్నాయి.. మరికొన్నిసార్లు అవి ఆరోపణలుగానే మిగిలిపోతున్నాయి. ఇక ఈ క్యాస్టింగ్ కోచ్ సంగతిని కాసేపలా పక్కనబెడితే.., అప్పట్లో సుర్వీన్ నటించిన హేట్ స్టోరీ-2 ట్రయలర్ వీడియోలు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించాయి. ఈ సినిమా ట్రయలర్‌ని ఇప్పటివరకు 1కోటి 30 లక్షల 30 వేల మంది వీక్షించారు.

Category:

0 comments