శ్రీమంతుడు స్పెషాలిటీ
ప్రిన్స్ మహేష్‌బాబు- శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న తెలుగు, తమిళ్ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోలు ఒక్కొక్కటిగా వదులుతున్నారు. తాజాగా శ్రీమంతుడు సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు లీక్ అయ్యింది.
శ్రీమంతుడు సినిమాలో మహేష్ మొత్తం ఏడు డిఫరెంట్ లుక్స్‌తో కనిపిస్తాడట. ఇవి చాలా స్టైలీష్‌గా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీకి ఉన్న ఇంపార్టెన్స్ దృష్ట్యానే ఈ స్టైలీష్‌లుక్స్‌తో మహేష్ కనిపిస్తాడని మహేష్‌కి స్టైలిష్ట్‌గా పనిచేసిన అక్షయ్‌త్యాగి ఈవిషయాన్ని వెల్లడించాడు. ఈ లుక్స్ అన్నీ సినిమాకే చాలా హైలెట్ కానున్నాయట.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో బిజినెస్ మ్యాగ్నెట్‌గా, కాలేజీ కుర్రాడిలా, మాస్ హీరోగా ఉన్న లుక్స్‌ని చూపించారు. మరి ఆ మిగతా లుక్స్ చూడాలంటే ఆగష్టు 7వరకు ఆగాల్సిందే. మైత్రీ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వం వహించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన సంగీతానికి ఇప్పటికే గుడ్ రెస్పాన్స్ వచ్చింది.
Category: FILM NEWS
0 comments