రజనీకాంత్ 'దృశ్యం' రీమేక్ లో ఎందుకు నటించనన్నారు!?
దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ తెరకెక్కిన దృశ్యం మూవీ... కోలీవుడ్ లో పాపనాశం పేరుతో రీమేక్ అయ్యింది... కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా తమిళనాట విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.... సస్పెన్స్ తో పాటు సెంటిమెంట్ కు ఎక్కువగా స్కోప్ ఉన్న ఈ సినిమాను తమిళ తంబీలు కూడా బాగా ఆదరిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి... రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా... తమిళంలోనూ హిట్ అనిపించుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ఫిక్స్ అయిపోయాయట... సినిమా రిజల్ట్ సంగతి అలా ఉంచితే... ఈ సినిమాలో నటించాలని సూపర్ స్టార్ రజనీకాంత్ ను ముందుగా అప్రోచ్ అయ్యారట దర్శకురాలు జీతూ జోసెఫ్... స్టోరీ తనకు ఎంతగానో నచ్చినా... ఓ రెండు సీన్ల విషయంలో ఉన్న అభ్యంతరం కారణంగా రజనీకాంత్... పాపనాశంలో నటించలేదట...
తెలుగులో దృశ్యం రీమేక్ సక్సెస్ అయిన తరువాత కోలీవుడ్ లో ఈ సినిమాను రీమేక్ చేయాలని భావించిన జీతూ జోసెఫ్... కమల్ హాసన్ కంటే ముందు రజనీకాంత్ ను కలిశారట... సినిమాను చూసి బాగా ఇంప్రెసయిన సూపర్ స్టార్... ఓ రెండు సీన్ల విషయంలో మాత్రం అభ్యంతరం చెప్పారట. పోలీసులు తనను కొట్టడాన్ని అభిమానులు జీర్ణించుకోలేరని... క్లైమాక్స్ సీన్ కూడా కాస్త వీక్ గా ఉంటుందని అన్నారట రజనీకాంత్. సూపర్ స్టార్ మాటలు విన్న తరువాత... ఈ మూవీ రీమేక్ లో ఆయన నటిస్తే వర్కవుట్ కాదేమో అని జీతూ జోసెఫ్ కూడా భావించిందట. దీంతో ఆ తరువాత సీన్ లోకి కమల్ హాసన్ ఎంటరవడం... సినిమా చకచకా షూటింగ్ జరుపుకుని ఆడియెన్స్ ముందుకు రావడం వేగంగా జరిగిపోయాయి. ఏదేమైనా దృశ్యం రీమేక్ లో నటించడానికి రజనీకాంత్ నిరాకరించాడనే ఇష్యూ... కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది...
Category: FILM NEWS
0 comments