ఎన్టీఆర్ కూడా అందులో అడుగు పెట్టాడట

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇది అనాదిగా వస్తున్న నానుడిని ఆతరం హీరో శోభన్ బాబు పాటించాడు రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి వేలకోట్లు సంపాదించాడు . కాగా ఆ బాట ని శోభన్ బాబు నుండి స్పూర్తి పొందిన నటీనటులు తెలుగులో చాలామందే ఉన్నారు కాగా ఇప్పుడు ఈ తరం హీరో ఎన్టీఆర్ కూడా అందులో అడుగు పెట్టాడట . అయితే శోభన్ బాబు భూములను కొంటే ఎన్టీఆర్ మాత్రం హైదరాబాద్ లోని కొన్ని ప్లాట్ లను కొని వాటిని అద్దె కు ఇచ్చాడట దాంతో నెల నెల కొంత మొత్తం వస్తుంది అంతేకాదు భవిష్యత్ లో ఆ పెట్టుబడి మరింతగా పెరుగుతుంది కాబట్టి ఇది మంచి మార్గమే అని అనుకున్నాడట ఎన్టీఆర్ . పైగా తనకు పిల్లనిచ్చిన మామ నార్నే కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండటం వల్ల ఇటువంటి విషయాలలో నార్నే అనుభవం కూడా పనికొస్తుంది
Category: FILM NEWS
0 comments