పిల్లా నువ్వు లేని జీవితం మూవీ రివ్యూ

Unknown | 17:24 | 0 comments

కథ:
అల్లరి చిల్లరగా తిరిగే శ్రీను(సాయి ధరమ్ తేజ) ఓ అమ్మాయి సిరి(రెజీనా) ని ఓ రోజు చూసి ప్రేమలో పడిపోతాడు. పడింతే తడువుగా అందరి హీరోలు లాగే ఆమె వెనక పడతాడు. అంతేకాదు ఆమెకు కుటుంబపరంగా ఓ సమస్య ఉందని, అందులో భాగంగా ఆమెను హత్య చేసేందుకు మైసమ్మ (జగపతిబాబు) అనే కాంట్రాక్ట్ కిల్లర్ టైప్ రౌడీ కు సుపారీ ఇచ్చారని తెలుసుకుంటాడు. దాంతో ఆ అమ్మాయి లేకపోతే జీవితమే లేదు అనుకునే ఈ కుర్రాడు ఆమెను ఎలా రక్షించాడు. అసలు ఆమెను చంపాలనుకోవటానికి కారణం ఏమిటి…చివరకు ఆమె ప్రేమను ఎలా సాధించాడు అనేది మిగతా కథ

విశ్లేషణ:

సాయిధరమ్ చేసిన సినిమాల్లో ఇది రెండోదే అయినా.. ఆడియెన్స్ ముందుకొచ్చింది మాత్రం ఇదే మొదటిదని ఆల్రెడీ తెలిసిందే. అయితే మూవీలో సాయి పర్‌ఫార్మెన్స్ మాత్రం రెండవ సినిమాకన్నా కాస్తంత అనుభవజ్ఞుడిగానే కనిపించాడనే ప్రశంసలు వినిపించాయి. డ్యాన్స్‌ల విషయానికొస్తే తన మెగా నేపథ్యాన్ని తెరపై ప్రదర్శించుకోవడంలో సాయి ప్రస్తుతానికి సక్సెస్ అయ్యాడు. కాకపోతే ముఖ కదలికలు, హావభావాల్ని పలికించడంపైనే కాస్తంత దృష్టిసారించాల్సిన అవసరం వుందేమోననేది సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. ఇక రెజీనా విషయానికొస్తే, చేస్తున్న ప్రతీ సినిమాలోనూ ఫ్రెష్ లుక్‌తో కొత్తగా కనిపించడం ఆమెకున్న అదనపు అసెట్. అలాగే ‘పిల్లా నువ్వు లేని జీవితం’లోనూ పిల్లగా రెజీనా పర్‌ఫార్మెన్స్ ఆడియెన్స్‌ని బాగానే ఆకట్టుకుంది.

‘లెజెండ్’తో తనలో దాగున్న మరో టాలెంట్‌ని వెలికితీసిన జగపతి బాబు ఈసారి కూడా మైసమ్మగా బాగానే రెచ్చిపోయాడు. తనదైన డైలాగ్ డెలివరీతో ఆ పాత్రలో ఒదిగిపోయాడు. జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇదో మైలురాయిగా నిలిచిపోతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి. సినిమాని సాగదీయకుండా.. కరెక్ట్ స్పీడ్ మెయింటెన్ చేయడంలో రవికుమార్ సక్సెస్ అయ్యాడు. పర్‌ఫెక్ట్ టైమింగ్, పర్‌ఫెక్ట్ నెరేషన్‌తో సినిమాని ఉరకలెత్తించిన ఘనత ఆయనదే అని చెప్పుకోవాలి. ‘యజ్ఞం’ తర్వాత చేసిన మూడు సినిమాలు ఆశించినంత ఫలితాన్నివ్వకపోవడంతో అప్పటినుంచీ తనకున్న కసినంతా ఈ స్ర్కిప్ట్‌పై చూపించాడా అన్నట్లు ఎక్కడికక్కడ నరుక్కెళ్లాడు. కాకపోతే.. హీరో, హీరోయిన్, విలన్ పాత్రల మధ్య వున్న సంబంధాలు, ఆయా పాత్రల మధ్య వున్న పరిస్థితుల్ని మరికాస్త మెరుగ్గా చూపిస్తే బాగుండేది. విలన్స్ కారణంగా సఫర్ అవుతున్న హీరోయిన్ పరిస్థితుల్ని తెరకెక్కించడంలో… హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్‌కి ఇంకాస్త స్కోప్ వుందేమోననిపించినప్పటికీ.. స్టోరీ నెరేషన్ ఆ వెలితిని కవర్ చేసింది.



నటీనటులు:సాయిధరమ్‌తేజ్‌, రెజీనా, జగపతిబాబు, చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రభాస్ శ్రీను, సత్యవాణి, రఘుబాబు, రజిత, జోష్ రవి తదితరులు

సంగీతం:అనూప్ రూబెన్స్,
పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ,
కెమెరా: దాశరథి శివేంద్ర,
ఎడిటింగ్:గౌతమ్‌రాజు,
మాటలు:డైమండ్ రత్నం, వేమారెడ్డి,
నిర్మాతలు: బన్నివాసు, హర్షిత్,
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.
*** రేటింగ్ : 3/5

Category:

0 comments