ఎర్రబస్సు మూవీ రివ్యూ
కథః
ఊరిలో ఉండే రాజేష్(మంచు విష్ణు)కు తాతయ్య నారాయణ రావు (దాసరి నారాయణ రావు) లోకం. ఆయన సంరక్షణలోనే పెరిగి పెద్దవుతాడు. ఇక రాజేష్ కు అమెరికాకు వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని ఆశ. ఇందుకోసం చాలా కష్టపడతాడు. ఈ క్రమంలోనే రజ్జి(కేథరిన్)ను చూసి ప్రేమలో పడతాడు. చివరకు ఎలాగోలా అమెరికా వెళ్లే అవకాశం పొందుతాడు. విదేశీయానంకు మూడు నెలలు సమయం ఉందనగా.., ఈ ఖాళీని తాతయ్యతో గడపాలని కోరుకుని ఆయన్ను ఊరినుంచి సిటీకి తీసుకొస్తాడు. అలా నగరానికి వచ్చిన నారాయణ రావు ఏం చేశాడు… తాతయ్య వల్ల రాజేష్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అమెరికా పర్యటన ఏమైంది? అనే అంశాలు వెండితెరపైనే చూస్తేనే బాగుంటుంది.
విశ్లేషణః
దాసరి తన నటనతో చిత్రాన్ని నిలబెట్టారు. ఆయన పాత్ర ఆద్యంతం చిత్రాన్ని నడిపిస్తూ ఉంటుంది. విష్ణు తన పాత్రకు న్యాయం చేశాడు. తన గత చిత్రాలతో పోలిస్తే దీంట్లో నటన కొంచెం బెటర్ అయ్యాడనే చెప్పాలి. కాథరిన్ కూడా తనకి ఉన్నంతలో బానే చేసింది. దాసరి ఈ చిత్రంలో విభిన్నకోణాల్లో కనిపిస్తారు. దాసరి మరియు విష్ణుల మధ్య ఉన్న సన్నివేశాలు చిత్రానికి వెన్నెముక పాత్ర పోషిస్తాయి. కథ మరీ పురాతనకాలం నాటిది అవడం ఈ చిత్రానికి ప్రధాన సమస్య. ఇందులోని సన్నివేశాలు మరీ సెంటిమెంట్ ని బేస్ చేసుకుని ఉండడం, కామెడీ అసలు లేకపోవడం ప్రేక్షకుడికి పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. దానికితోడు ఎర్రబస్సు అనే టైటిల్ ఈ సినిమా అంతగా కుదిరినట్లు లేదు. దాసరి, విష్ణుల మధ్య ఉన్న సన్నివేశాలు అసలే సెంటిమెంట్ తో నిండి ఉండడం, దానికితోడు అవి నెమ్మదిగా, ఊహించదగ్గవిగా ఉండడంతో అవి పెద్దగా వర్కౌట్ అవవు. స్క్రీన్ ప్లే లో పెద్దగా మార్పులు చెయ్యకపోవడం ఈ సినిమాకి అంతగా కలిసి రాలేదు. చివరిగా ఏంటంటే!! ఎర్రబస్సు పాత సుత్తి కథతో బోర్ సినిమా అయినప్పటికీ దాసరి తన నటనతో ప్రాణం పోశారు, కాని తన అసలు డ్యూటీ అయిన దర్శకత్వంలో విఫలమయ్యారు. విష్ణు చేసిన గెస్ట్ రోల్ కంటే కొంచెం పెద్దదైన పాత్రలో తను చేసిన నటన పర్లేదు.
నటీనటులు: దాసరి నారాయణరావు, మంచు విష్ణు, క్యాథరిన్ థెరిసా, బ్రహ్మానందం, హేమ, రఘుబాబు, కాశీవిశ్వనాథ్ తదితరులు;
కెమెరా: అంజి,
సంగీతం: చక్రి,
కథ: ఎన్. రాఘవన్,
మాటలు, స్క్రీన్ప్లే, నిర్మాత, దర్శకత్వం: దాసరి నారాయణ రావు.
*** రేటింగ్ – 2/5
Category: Movie Reviews
0 comments