పవన్ సరైన కథ సెలెక్ట్ చేసుకొని ఉంటే...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాహుబలి సినిమాను తెరకెక్కించిన రాజమౌళి అండ్ కో ని పొగడ్తల వర్షంలో ముంచెత్తిన విషయం విధితమే. మన తెలుగు వారినుండి.. ఇలాంటి సినిమా ఒకటి వస్తుందని కలలో కూడా ఊహించలేదని కూడా పవన్ వ్యాఖ్యానించాడు. కాగా ఈ ప్రశంసలకు రాజమౌళి అండ్ టీం చాలా సంతోష పడిందని ఇండస్ట్రీ టాక్. కాగా ఇప్పుడు రాజమౌళి కూడా పవన్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. మగధీర రికార్డ్స్ ను బ్రేక్ చేసిన సినిమా అత్తారింటి దారేది. నిజానికి పవన్ కళ్యాణ్ కనుక సరైన కథను సెలక్ట్ చేసుకొంటే... టాలీవుడ్ సినిమా ఎప్పుడో రూ. 100 కోట్ల మార్క్ ని దాటేసి ఉండేది అని రాజమౌళి సర్ ప్రైజ్ కామెంట్స్ చేశాడు. ఇప్పటికీ బాక్సాఫీస్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ పవన్ సినిమా తర్వాతే ఎవరిదైనా అని పవన్ ని రాజమౌళి పొగిడాడు. దీంతో పవన్ సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయట. ఇలా ఒకరిపై ఒకరు పొగడ్త వర్షం కురిపించుకొంటున్నారు. కాగా ప్రస్తుతం తెలుగు సినీ అభిమానులు మాత్రం రాజమౌళి వలన బాలీవుడ్, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆదిపత్యానికి టాలీవుడ్ తెరదించినట్లైంది. ఇక రుద్రమదేవి కూడా హిట్ అయ్యి మంచి పేరు సంపాదించుకుంటే.. మళ్లీ తెలుగోడి సినీ సత్తా చిత్ర సీమకు తెలిసొస్తుందని అని వ్యాఖ్యానిస్తున్నారు.
Category: FILM NEWS
0 comments