బాహుబలి రివ్యూ
నటీనటులు: ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, సుదీప్ తదితరులు
బ్యానర్: ఆర్కా మీడియా
సమర్పణ: కె.రాఘవేంద్రరావు
సంగీతం: ఎంఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: ఎస్‌కె.సెంథిల్ కుమార్
కథ: విజయేంద్రప్రసాద్
నిర్మాతలు: దేవినేని ప్రసాద్, శోభు యార్లగడ్డ
దర్శకత్వం: ఎస్ఎస్.రాజమౌళి
రేటింగ్ 4/5
మూడు సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబళి చిత్రం భారీ అంచానాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే రీతీలోనే ప్రేక్షకుల అంచనాలు అందుకుని భారతీయ చలన చిత్ర రంగంలోనే చరిత్ర సృష్టించింది. తన కళను ఒక మూవీ ద్వారా ఇంత అద్బుతంగా చూపించడం ఒక్క రాజమౌళికి మాత్రమే సాధ్యమవుతుందని నిరూపించుకున్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు SS రాజమౌళిని సూపర్ సక్సెస్ రాజమౌళిగా పిలుస్తారనడంలో అతిశయోక్తి లేదు.
ప్రముఖ వెబ్‌సైట్ IMDB(Internet Movie Database) ఈ చిత్రానికి గాను 9.5/10 రేటింగ్ ఇచ్చింది. అలాగే మరిన్ని బాలివుడ్ సినీ వెబ్‌సైట్స్ 4/5 రేటింగ్ ఇచ్చాయి.
అందరి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉండడంతో ప్రభాస్ అభిమానులు, అలాగే సినీ ప్రియులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ చిత్రంతో రాజమౌళి ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరుకుందని చెప్పాలి.
IMDB అవతార్ మూవీకే 8/10 రేటింగ్ ఇచ్చింది. అలాంటిది బాహుబళి చిత్రానికి 9.5/10 గా ఇచ్చిందంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
హైలైట్స్ :
పిక్చరైజేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద పెద్ద కొండ చర్యల్లో ఊడలు పట్టుకొని వ్రేలాడుతూ ఉన్న సీన్లు చాలా ఎగ్జైట్ మెంట్ గా అనిపిస్తాయి.
రమా రాజమౌళి కాస్ట్యూమ్స్‌ని హాలివుడ్ రేంజ్‌లో తీర్చిదిద్దారు.
ప్రభాస్ ఇంట్రడక్షన్ చాలా బాగుంది. చాల హ్యండ్సమ్ గా కనిపిస్తాడు.
బల్లాల దేవ (రానా) ఇంట్రడక్షన్ చాలా అద్భుతంగా ఉంది.. కండలు తీరిగిన యోధుడులా.. ఎద్దుతో భీకరంగా ఫైటింగ్ సీన్ చాలా బాగుంటుంది.
సెకండ్ ఆఫ్‌లో లీడింగ్ రోల్స్ యాక్టింగ్ అందర్ని ఆకట్టుకుంటాయి.
తమన్నా అందం అందరిని ఆకర్షించి నిజంగా దేవకన్య అనిపించేలా ఉంటుంది.
డైలాగ్ : పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా కట్టప్పా బల్లాల దేవ కు చితి పేరుస్తున్నా..
సినిమాలో కీరవాణి అందించిన బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కు అందరూ ముగ్దులైపోతారు.
ఫస్ట్ ఆఫ్ మొత్తం బాహుబలి కనిపించడు.
తల్లి పాత్రలో అనుష్క అద్భుతంగా నటించింది.
రానా, నాజర్ ల మద్య సన్నివేశాలు సీరియస్ గా ఉంటాయి.
శివుడిని చూసి కట్టప్ప రియలైజ్ అయిన సీన్ చూస్తే థియేటర్లో అంతా తెలియని ఎమోషన్‌కు లోనవుతారు. ఈ ఒక్క సీన్ చాలు సినిమా అద్భుతం అనడానికి... అన్న రేంజ్‍లో ఈ సీన్‌ని తెరకెక్కించారు.
ఎస్.ఎస్. రాజమౌళి వ్యాపారస్తుడిగా సినిమాలో కనిపిస్తాడు చిన్న డైలాగ్ ‘డబ్బుందా..!
కాలికేయ తమ ఆదిమవాసులతో మాట్లాడే కోయబాష విచిత్రంగా ఉంటుంది. రాజమౌళి ఈ భాషను స్పెషల్ గా తయారు చేశారు. దానికోసం లిపి కూడా తయారు చేశారు. ఇప్పటి వరకు ఈ ప్రయోగం ఎవరూ చేయలేదు దటీజ్ రాజమౌళి..!
యుద్ద వ్యూహాలు పిక్చరైజేషన్ ఇప్పటి వరకు ఏ సినిమాలో చూపించని విధంగా చూపించారు.
డైలాగ్స్ : వందమందిని చంపితే వీరుడు అవుతాడు.. ఒక్కడిని కాపాడితే దేవుడు అవుతాడు.. కత్తి పోటుకన్నా.. బల్లెం పోటు కన్నా..దారుణమైంది వెన్నుపోటు
Category: Movie Reviews
0 comments