చిరంజీవి చిత్రం లో రామ్ చరణ్ హీరోయిన్...

Unknown | 06:33 | 0 comments

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందే 150 వ సినిమా జోరందుకుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వం లో ఈ సినిమా రుపొండుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి పూరి అవుట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. మరో వైపు పూరి బ్యాంకాక్ లో చిరు సినిమా గురించి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. చిరంజీవి హీరోగా నటించే సినిమాకు దర్శకుడిగా వినాయక్ ను దింపే ఆలోచనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వినాయక్ అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కుడా దాదాపు పూర్తీ అయినట్టే .. కాబట్టి వినాయక్ ఈ సినిమాకు ఫైనల్ అయ్యేలా ఉన్నాడు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా  రామ్ చరణ్ భామ తమన్నా ను హీరోయిన్ గా తీసుకోవాలనే ప్లాన్స్ జరుగుతున్నయాట !! మెగాస్టార్ కుడా ఈ సినిమాకోసం చాలా సన్నబడ్డాడు కుడా. సో ఆగష్టు 22 న చిరంజీవి పుట్టినరోజున ఈ సినిమాను లాంచ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. సో త్వరలోనే అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది . 

Category:

0 comments