టికెట్లు కొనలేక విలవిలలాడుతున్నారు
బాహుబలి భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మొదటి రోజునే బాహుబలి ని చూడాలని ఆశించిన వాళ్ళకు భంగమే ఎదురు అవుతోంది . ఎందుకంటే ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం బాహుబలి టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి ,వాటిని బ్లాక్ లో కూడా అమ్ముతున్నారు ,బాగా డబ్బున్నవాళ్ళు వేలకు వేలు పోసి కొంటారు కానీ సామాన్యుడు ఆ రేటు ని భరించగలడా ? మామూలు రేటు ఉన్న సమయంలోనే సినిమాకెళ్ళి ఎంటర్ టైన్ అవ్వాలని చూసే కామన్ ఆడియన్స్ కి బాహుబలి టికెట్ రేటు కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తోంది . ఇప్పటికే ఆన్ లైన్ లో నాలుగు రోజుల వరకు టికెట్స్ అమ్ముడుపోవడంతో సామాన్యులకు దిక్కు తోచడం లేదు . అభిమానంతో బాహుబలి ని చూడాలని ఆశిస్తున్న వాళ్ళకు అభిమానం ఒక్కటే ఉంటే సరిపోదని జేబు నిండా డబ్బులు కూడా ఉండాలని అప్పుడే సినిమాని చూసే చాన్స్ ఇస్తామని ఇష్టారాజ్యాంగ ప్రవర్తిస్తున్నారు కొందరు . ఈ టికెట్ రేట్లు ఇలా ఉండగా బెనిఫిట్ షో లంటూ చేస్తున్న సందడి చూస్తే అభిమానులు విలవిలలాడటం ఖాయం .
tags;baahubali songs free download,baahubali movie tickets,baahubali video songs free download
Category: FILM NEWS
0 comments