మెగా హీరో సరసన అందాల భామ
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హాట్ బ్యూటీ రాశీ ఖన్నా. రీసెంట్ గా జిల్ సినిమాలో హాట్ హాట్ అందాలతో మరోసారి తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ భామ రామ్ సరసన శివం’ సినిమాలో, అలాగే రవితేజ సరసన బెంగాల్ టైగర్’ సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే రాశి ఖన్నాకి తాజాగా మరో బంపర్ ఆఫర్ వచ్చింది. మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ సరసన నటించే అవకాశం దక్కింది. ఈ ఏడాది ‘పటాస్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ ఓ సినిమాకి సైన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నాని సెలక్ట్ చేసారని సమాచారం. అనిల్ రావిపూడి చెప్పిన కథ నచ్చడంతో రాశి ఖన్నా వెంటనే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
Category: FILM NEWS
0 comments